కళ్యాణి కధ

  1. home
  2. Books
  3. కళ్యాణి కధ

కళ్యాణి కధ

4.00 2 1
Share:

ఈ కళ్యాణితో, నాకు పరిచయం, దాదాపు 2 సంవత్సరాల నాటిది.ఈమె...

Also Available in:

  • Amazon
  • Audible
  • Barnes & Noble
  • AbeBooks
  • Kobo

More Details

ఈ కళ్యాణితో, నాకు పరిచయం, దాదాపు 2 సంవత్సరాల నాటిది.

ఈమె చిన్న వయసు పాఠకురాలే.

ఉన్న వాస్తవాలనే యధాతధంగా తీసుకుంటే, అవే 'కధలు'గా అయిపోతే, అలాంటి కధ, 'వాస్తవ వార్త'గా మాత్రమే వుండిపోతుంది. వాస్తవాలూ, కల్పనలూ కలిసినదే, 'రచన!' అది, నిజ చరిత్ర కాదు.

వాస్తవాలనే, సహజత్వాలుగా భావించే రచనలు, ఆ వాస్తవ భావాలనే 'అవి అంతే' అన్నట్టు చూపిస్తాయి. 'తప్పు'ని గ్రహించగలిగితే, అది అభ్యుదయం ! 'తప్పు'ని పూర్తిగా 'ఒప్పు'గా మార్చగలిగితే, అది 'విప్లవం !'

పాఠకులు చెప్పిన విషయాల్ని, 'కధ' పేరుతో యధాతధంగా ఎక్కించెయ్యడం కాదు, నేను చేసేది. ఆ వాస్తవాలు ఎలా మారాలనీ, ఎలా మారడం న్యాయమైన పరిష్కారమనీ, నేను నేర్చుకున్నానో, అలాంటి మార్పులు నేను రాసే పుస్తకాల్లో జరగాలనుకుంటాను.

పాఠకులు చెప్పే సమాచారాలు, వాళ్ళ సమస్యలకు సాక్ష్యాలు! సమస్యల వాళ్ళకి, వాటి వల్ల 'బాధ' చాలా వుంటుంది. బాధకి, 'వైద్యం' కూడా వుంటుంది గానీ, ఆ వైద్యం, సమస్యల వాళ్ళకి అందుబాటులో వుండదు. అందుకే, ఆ జీవితాలు సమస్యలతోనే అంతరిస్తాయి.

ఏ రచనకైనా, ఎవరు రాసిన దానికైనా, దానికి ఆధారం, తప్పులతో వున్న ఈ నాటి వాస్తవ సమాజమే. ఈ సమాజాన్ని అలాగే నిలుపుకుంటే, రచనలన్నీ నిష్ప్రయోజనాలే కదా? రచనలే దండగ కదా?

కాబట్టి, సమస్యలకు పరిష్కారాల్ని తెలుసుకోవాలి. వాటిని పాటించాలి. ఇది, వ్యక్తిగత విషయంలో అయినా మొత్తం సమాజ విషయంలో అయినా! ఈ రెండు రకాలూ, కలిపి పోయి వుంటాయి! కొన్ని సమస్యల్ని, విడిగానే పరిష్కరించుకోవడం సాధ్యమే. అత్యవసరమే. కానీ, ఆ పరిష్కారం సంపూర్ణంగా వుండదు.

ఎవరి సమస్య, వారికి ముఖ్యం అయినా, ఏ మనిషికైనా, ఇతరుల సమస్యలు మరింత ముఖ్యం!

- రంగనాయకమ్మ

  • Format:Hardcover
  • Pages:328 pages
  • Publication:2021
  • Publisher:Sweet Home Publications, Hyderabad.
  • Edition:First
  • Language:tel
  • ISBN10:
  • ISBN13:
  • kindle Asin:B0DM4FHGYV

About Author

రంగనాయకమ్మ

రంగనాయకమ్మ

3.98 724 80
View All Books