శంభలా నగరం
రచయిత కాల్పనిక నవల అని ముందే తేల్చేశారు కానీ చదవడం...
Also Available in:
- Amazon
- Audible
- Barnes & Noble
- AbeBooks
- Kobo
More Details
రచయిత కాల్పనిక నవల అని ముందే తేల్చేశారు కానీ చదవడం మొదలు పెడితే మనకు అలా అనిపించదు. అంతా వాస్తవికంగా కళ్ల ముందే జరుగుతున్నట్టు ఉంటుంది. ఒక కల్పనకు వాస్తవానికి దగ్గరగా రాయడం దగ్గరే కదా మనకు రచయిత ప్రతిభ తెలిసేది. ప్రతిభ మెండుగా ఉన్నవాడు దర్శణం శ్రీనివాస్ శంభలా నగర యాత్ర నిండా అనేక సాహసాలు, ఉపద్రవాలు, వింత అనుభవాలు, అక్కడక్కడా ఆహ్లాదాలు- అన్నింటినీ దాటుకుని చివరికి శంభలా నగరాన్ని చేరుకుంటే అక్కడ ఏమైందో నవల చదివి తరించాల్సిందే. రచయిత కథానుసారంగా వివరించే పలు ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రక, పౌరాణిక అంశాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అందుబాటులో ఉన్న లేదా ఇదివరకే మనందరికీ తెలిసిన కొన్ని విడి విడి విషయాలను ఒక చోట కలిపి అలోచిస్తే జరగడానికి అస్కారమున్న అద్భుతాల గురించి కూడా రచయిత వివరిస్తాడు. మొదలు పెట్టడం ఒక్కటే మన వంతు తర్వాత మనల్ని చివరిదాక అవకుండా చదివించే బాధ్యత రచయిత తీసుకున్నాడు.
- Format:Paperback
- Pages:104 pages
- Publication:2024
- Publisher:విశాల్ ప్రచురణలు
- Edition:
- Language:tel
- ISBN10:
- ISBN13:
- kindle Asin:B0DM4PCJGX

